23, మార్చి 2009, సోమవారం

దైవ ప్రేమ

పై శీర్షిక గురుంచి అర్ధం తెలెయని వారు ఎవరూ ఉండరు .దైవం శ్రిష్టి యెంత గొప్పది. అసలు జీవరాసి ని శ్రుష్టి o చే

ముందర , ప్రక్రుతి ని shrushTiee క రించాడు .ఎందుకంటె జీవరాశిని శ్రుష్టి o చే ముందర జీవరాశికి కావలసిన

తిండి , నీరు మొదలగు అవసరాలను అందించాడు . అసలు జీవి ని తయారు చేసేటప్పుడు దైవం నోటి దగ్గరకు

వచ్చి,"అవునూ -ఈ నోటికి తిండి రెడీ చేయాలి" కదా అని జీవి మూతికి మేత ను రెడీ చేసాడుట. చూడండి......

జీవికి ఆకలి తీర్చటం కొరకు దైవం ముందుగా నే తిండి ని రెడీ చేసాడు .మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మనమే

కాదు ఏ జీవి అయిన తల్లి తీసుకొనే ఆహారం బిడ్డకు అందేలా చేసి మనం భూమి మీద కు వచ్చేటప్పటికి తల్లి కి

తన స్తనముల నుంచి పాలను వచ్చే ఏ ర్పాటు చేస్తాడు. ఆలా గే దైవం - బిడ్డ కు శ్వాస ,శరీర నిర్మాణం లో ఎంతగానో
శ్రమిస్తాడు.తల్లిని బిడ్డ గుర్తించే విధమ్ గ చేస్తాడు. బిడ్డ కు ఆకలి వచ్చినప్పుడు ఏడుపు ద్వార వ్యక్త మైనట్లు , అలాగే
తల్లికి బిడ్డ ఆకలి టైం కి పాలు స్రవించే టట్లు దైవం సహాయo చేస్తాడు. మనుషుల కే కాదు ..జంతువుల ను కూడా
ప్రేమ తో పాలిస్తున్నాడు .బిడ్డలు కూడా వాటి తల్లులను గుర్తించే విధమ్ గ చేస్తాడు. పక్షి జాతి ని చూడండి .....
అవి గుడ్లు పెట్టే సమయానికి ముందుగా నే వాటికి ఒక గూడు కట్టటానికి సహాయ పడతాడు. గుడ్లను పెట్టిన
పక్షి అది జాగ్రత్తగా తన బరువు పడకుండా పొదగటం కి , అది పొందే ఆనందానికి సహాయ పడతాడు .చక్కటి
వాతావరణం కలిగిస్తాడు. అలాగే జీవులకు కావలసిన ఆక్సిజన్ ని తను సృష్టించిన వృక్ష సంపద నుంచి ఇచ్చి
కాపాడుతున్నాడు.ఎన్ని కాలాలు మారిన సూర్య చంద్రులు వారి చర్యలు మారకుండా చూస్తున్నాడు.భూమి
తన భ్రమణం ఆగ కుండ చేస్తాడు. అల్లాగే భూమి ఆకర్షణ తగ్గకుండా చూస్తున్నాడు.మన శరీరం లో ప్రవహించే
రక్తం ను తయారు చేస్తున్నాడు. ఎవరి మనసులో ఏముందో ఇతరులకు తెలయకుండా తన మహిమను చూపిస్తున్నాడు.నోటి తో నే తిండి తినేటట్లు అలాగే విసర్జన ఏర్పాటు విడివిడిగా చేసాడు.తన శ్రుష్టి ని నాగరిక
మనవుడు చేయగలడా. నిప్పును పైకి ఎగిసేటట్లు, నీరు పల్లంకి ప్రవహించేటట్లు చేసాడు.మంచి మనసు తో
మనల్ని తయారు చేసాడు.మంచి రక్తంతో మనల్ని శ్రుష్టించాడు . అయన దృష్టి లో అందరూ సమాన మే .
కాని మనం ఏమి చేస్తున్నాం. దైవం మనకు ఇచ్చిన జన్మను ద్వేష /స్వార్ధ పూరిత వాతావరణం గ కొంతమంది
కలుషితం చేస్తున్నారు.చెడు రాజకీయాలు చేస్తున్నారు.బిడ్డలకు మంచి ఆహారాన్ని ఇవ్వకుండా చాల మంది
దారి తప్పుతున్నారు .దైవం ని మరచి మత్తులో కొందరు చేరుతున్నారు.సాంప్రదాయాలు గాలికి వదులుతున్నారు.
దైవం తనకంటూ ఏమీ అడగ లేదు కదా. మంచి మనసుతో అందరూ కలిసి మెలిసి జీవించండి అన్నారు. మనం
మాత్రం ................ ఏం చేస్తున్నాం. కలుషితమైన ఆహరం, నీరు, తయారు చేసుకొని తింటున్నాం.దైవ ప్రార్ధన
చేయటం తగ్గించాము .దైవం యెంత మంచి వాడంటే ---శివుడు భక్తులను "మీరు సువాసనలు గల పుష్పాలు మీరు
తీసుకొని నాకు ఉమ్మెత్త పూలూ ,ఆకులూ లాటివి సమర్పించు.అలాగే పాలు నువ్వు తీసుకొని నాకు నీరు అభిషేకించు .రత్నాలు , వజ్రాలు ,బంగారపు ఆభరణాలు నువ్వు వేసుకో.నాకు సర్పాలు ఆభరణం గ చాలు.
పూర్ణిమ వల్ల వచ్చే వెన్నెల ను చూసి నువ్వు ఆనందించు . నాకు అమావాస్య ముందర చతుర్దశి నాకు ఇవ్వు .చక్కటి
పాలు నిచ్చే గోవును నీవు తీసుకో .నాకు ఎద్దును వాహనం గా ఇవ్వు" అన్నారుట. దైవ ప్రేమ యెంత గొప్పది.
తను సృష్టించిన జీవుల మీద యెంత ప్రేమ. మనం గూడ త్యాగం, ప్రేమ,మంచి వాతావరణం, దాన గుణం ,భూత దయ,
మొదలగు మంచి సంస్కరమంతమైన సాంప్రదాయాలను అలవరచు కోవాలి.మంచి పురాణ గ్రంధాలను చదివి
అర్ధం చేసుకొని, మన పిల్లలకు చెప్పి మంచి సాంప్రదాయాలకు నేలబెట్టండి. శ్రుష్టి కర్త ప్రేమను గుర్తించండి.
మనతో మనం పోయిన తర్వాత మన వెంట వచ్చేవి -మనం చేసిన పుణ్య కార్యాలు ,దాన గుణం, లేక చేసిన పాపం.
అందుకే ................దైవ ప్రేమ ను మరువ కండి ....ప్లీజ్.
భగవంతుడా... నీ శ్రుష్టి ని కాపాడు తండ్రి .........
తిలక్ పండ్రంగి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి