నా మనసు లోని స్పందనను మంచి మనసున్న వారికి చెపితే వారి స్పందన ఎలా ఉంటుందో మరి !
భూమి పై పుట్టిన ఏ ప్రాణి అయిన సరే తన దేహాన్ని భూమి పై వదలవలసిందే గదా ! మరి మనసు మాత్రం
మనము పోయిన తర్వాత భగవంతుని చేరుతుంది అంటారు.చూడండి ....ఎవరు అయిన దగ్గరవారు కనిపిస్తే
వాళ్ళు తో ఉన్నా ప్రేమ అభిమానం /లేదా ఈర్ష్య ద్వేషాలూ తో మనసు స్పందిస్తుంది.తల్లి ని చూస్తే ఒక రకం గాను ,
కుమార్తె /కుమారుని చూస్తే మన మనసు మరొక విధం గాను పులక రిస్తుంది.చిన్న పిల్లలను చూస్తే ..మనసు ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటుంది లేదా ఎత్తుకోవాలని అనిపిస్తుంది. అదే దైవం ని చూస్తే భక్తి భావం తో మనసు నిండి
ఉంటుంది . మనసు లో ఏదైనా భావమేర్పడితే ...మనసు వెంటనే అక్కడకు చేరుకుంటుంది .సంతోషం గా ఉన్న మనసుకు ఏదైనా భాధ వస్తే ఒక్కసారిగా మనసు మారి పోతుంది .మనసు ఒకోసారి ద్రవిస్తుంది మరొకసారి
క్షోభిస్తుంది .ఒక మనసు తల్లి ని కౌగలించు కున్నప్పుడు ఒక రకం గా స్పందిస్తుంది .అదే మనసు కూతరుని దగ్గరకు
తీసుకున్నప్పుడు వేరోకరకం గా , అదే భార్య తో కలిసినప్పుడు ఇంకో రకం గా మనసు స్పందిస్తుంది. చూసారా .........
దైవం తయారు చేసిన మనసు యెంత గొప్పదో. అందుకనేమో మనము మనసు చెప్పిన విధం గా నడుచుకుంటాము .
మనసు ఎప్పుడు సంతోషిస్తోందో తెలుసా .... కష్టం లో ఉన్నవారికి ఆదుకున్నప్పుడు ,దానం చేసినప్పుడు ,న్యాయం
చేసినప్పుడు ,తల్లి తండ్రులను గౌరవించి నప్పుడు , మన సాంప్ర దాయాలను నిలబెట్టి నప్పుడు ,దైవ పూజలు /భజనలు
దైవ కార్యక్రమాలు లో పాల్గొనప్పుడు మొదలగు మంచి పనులు చేసినప్పుడు మనసు ఎంత సంతోషిస్తుందో కదా .
మరి మనసు సంతోష పడితే ,దైవం గూడా ఆనం దిస్తాడు .ఎందుకంతే మనసు దైవం ది కదా !
అటువంటి మనసును చెడు పనులతో పాడు చెయ్యకండి . దైవం కు దూరం కాకండి .మంచి పనులు చేసి దైవం లాటి
మంచి మనసులతో ఆనందం గా /ఆరోగ్యం గా ఉండండి .మంచి మనసుకు మంచి రోజులు.
మనసును కలుషితం చేయకండి ........దయతో ఆలోచించండి ....ప్లీజ్ సర్/అమ్మ/అన్దరకూ .......
మనస్సాంతి అందరకు కలగాలని దైవాన్ని కోరుకుంటూ ......
తిలక్ పండ్రంగి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chaalaabaagaa cheppaaru. annatlu mee blog nu koodalilo pettaaraa? lekumte
రిప్లయితొలగించండిmee blog url nu veeven@gmaila com ku telapamdi.
మీకు..మీ కుటుంబానికీ..శ్రీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు..!
రిప్లయితొలగించండి