
సత్సంగం అనగా మంచి మనసులు గల మంచి మనుషులు చక్కటి వాతావరణం లో మంచి విషయాలు గురుంచి
వారి అభిప్రాయాలూ, వారి అనుభవాలు తెలియపరచటం . దీని వల్ల మనకు తెలియని చాల విషయాలు
తెలుసుకోవచ్చు. దీని వల్ల మన జ్ఞాన సంపద పెరుగుతుంది. మంచి వాతావరణం లో జరిగె ఈ సత్సంగం వల్ల మన
మనసులు అయుహ్ ఆరోగ్యం తో పాటు ఆనందం కలుగు తుంది గదా . ఏ మతం వారైనా సత్సంగం లో పాల్గొని దాని లో ఉన్న మంచి విషయాలుని తియ్యని అమృతం లా గ్రోలి ఆచరిస్తే తమకు ,తమ కుటుంబాలకు మంచి చేసినవారు
అవుతారు. భగవంతుడు శ్రుష్టి చే శ్రుష్టించబడిన ఈ దేహం మంచి పనులు అనగా దానం,క్షమా గుణం ,ఉపకారం,
ప్రేమ ,శ్రుష్టి కర్త పైన భక్తి ,అహింస ,భూత దయ ,సత్యమ్,ధర్మము గా ప్రవర్తిస్తే దైవం మనలను సర్వదా కాపాడుతాడని
సత్సంగం వల్ల తెలుస్తూంది.
సత్సంగం యెంత గొప్పదో తెలుసుకుందాం :
భూమండలమంతటిని ఆది శేషుడు తన పడగల పైన మోస్తున్నదుట ఒకానొక సమయం లో.ఒక నాడు రాజరిషి
విశ్వామిత్రుడు ఆది శేషుని చూసి " ఎందుకు భూమండలమును ఇంత కష్ట పడి మోస్తున్నావు? నేను నా తపః
శక్తి చే భూమి ని క్రిందకు పడకుండా ఆపగలను " అని ఆది శేషువు తో పలికెను .అయితే ఆది శేషువు "రాజ రిషీ-
ఇంత బరువైన భూమి ని మీకు ఒక లిప్త కాలము పాటు నేను నా శిరస్సు పైనుంచి వదిలినా ప్రళయం వస్తుంది (భూమి
క్రిందకు వేగంగా పడిపోవటం వల్ల ) అనెను." అప్పుడు రిషి చిరునవ్వుతో " ఆది శేషా -నువ్వు బూమి ని వదిలి బయటకు రమ్ము.నేను నా తపః శక్తి తో ఆపగలను అని" పలికెను.కొంత సేపు తర్కం జరిగిన పిమ్మట , అది శేషువు ఒక లిప్త
కాలము వదులుటకు అంగీకరించెను .వెంటనే శేషువు భూమి ని వదిలి రిషి దగ్గరకు వచ్చెను .రిషి తన తపః శక్తి ని
ఉపయోగించి భూమిని ఆపటానికి ప్రయత్నించెను.రిషి తపః శక్తీ అంతనూ ఉపయోగించిననూ , భూమి నిలబడ క
క్రింద కు దిగ సాగేను.రిషి కి ఏమి చేయవలెనో భోధ పడలేదు .అంతట శేషువు " రిషి వర్యా -తపః శక్తి విఫలము అయినది కదా.మీరు మహా మునులు .మీ దగ్గర సత్సంగత్యం వల్ల సంపాదించిన పుణ్యం ఏమైనా ఉంటే ,దానం చేయండి . దాని వల్ల భూమి దిగకుండా వుంటుంది "అనెను. రిషి తన మనసులో "అయ్యో-నేను ఎవరితో నూ సత్సాంగత్యం
చేయలేదు గదా.నాకు ఆ పుణ్య ఫలం ఎక్కడ నుంచి వస్తుంది ? అనుకొనెను .తను మనసులో మళ్లీ ఎప్పుడైనా తన
తోటి రిషి ల తో శాంతం గ గాని ,మంచి విషయములు తెలుసుకొంటాం లో వినయం గ ఉండి జ్ఞాన సంపద ఏమైనా
శాంతముగా ,మంచి మనసుతో సత్ సాంగత్యం చేసానా " అని తీవ్రమగా ఆలోచించ సాగేను.అంతలో వశిష్ట ముని తో
తను రాజు గ ఉన్నా కాలంలో సత్సంగత్యం ఒక లిప్త కాలము జరిగెనుట .వెంటనే శేషువు తో ఈ విషయం చెప్పి
లిప్త కాలములో సంపాదించిన సాంగత్య ఫలం ,భూమి గురుంచి మంత్ర మహిమ తో వదిలెను . భూమి గూడ
రిషి సంపాదించి వదిలినా పుణ్య ఫలమును సేఖరించి ఒక లిప్త కాలము ఆగెను . సాంగత్య పుణ్యం ఎంత శక్తీ
వంత మైనదో కదా.
మంచి ని కాపాడండి.సత్ సంప్ర దయలకు విలవలివ్వండి.స్త్రీలు,వృద్చులు,పిల్లలు nu kapadandi . manchi
grandhalanu chadivi aacharinchandi. meeku telisina manchini andaruku panchandi.l
shanthi shanthi shanthi hi.
tilak pandrangi
మంచి టపా రాసారు.
రిప్లయితొలగించండిమనం అజ్ఞాంతో తెలియక తప్పులు చేసి వాటికి ఫలితంగా దుఖాలను అనుభవిస్తూ భవంతుడిని నిందిస్తూ వుంటాం అయన ప్రెమేయం లేకపోయినా.మనసు అన్నది భవంతుడు ఇచ్చిన వరం.మనసు నిర్మలంగా వుంటే అలోచనలు బావుంటాయి.ఆలోచనలు బావుంటె మన ఆచరణలు/ ఎదుటివారిలో మంచిని చుడగలం.
"తలలు బోడులు అయినా తలపులు తలపులు బోడులా " అని వేమన అన్నట్టు అహంకారం నశిస్తే కాని చంచల మనస్సుకు మందు లేదు.
ఏమి అయిన అందరు సుఖం గా వుండాలి. అందరు అన్ని భదల నుండి విముక్తి పొందాలి.
మీరు మరిన్ని మంచి పోస్ట్ లు రాయాలి.
శాంతి శాంతి శాంతి.జై పరమేశ్వర్